నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ పంచాయతీ కార్యదర్శి స్రవంతి ఆత్మహత్యాయత్నం చేసింది. విధి నిర్వహణలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది. అనంతరం బంధువులకు ఫోన్ చేసి పురుగుల మందు తాగినట్లు చెప్పింది. అప్రమత్తమైన బంధువులు సర్పంచ్, గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులు స్రవంతిని ప్రథమ చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
గత కొన్ని నెలల క్రితమే భర్త మరణించడం, పని భారంతో ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. ఇలానే పనిభారం తట్టుకోలేక చిన్నపల్లి పంచాయతీ కార్యదర్శి ప్రత్యూష ఉద్యోగానికి రాజీనామా చేశారు.
పురుగుల మందు తాగిన పంచాయతీ కార్యదర్శి - పురుగుల మందు తాగిన పంచాయతీ కార్యదర్శి
నాగర్‌కర్నూల్ జిల్లా గుమ్మకొండ పంచాయతీ కారదర్శి స్రవంతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వ్యక్తిగత సమస్యలు, పనిభారంతో బలవన్మరణానికి పాల్పడింది.
పురుగుల మందు తాగిన పంచాయతీ కార్యదర్శి
TAGGED:
panchayat secretary suicide