తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి' - నాగర్​కర్నూలు జిల్లా తాజా సమాచారం

నాగర్​కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని రెండు గ్రామాలను పల్లెప్రగతి రాష్ట్ర పరిశీలకులు కృష్ణయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలని అధికారులను ఆదేశించారు.

Palle pragathi observer visits nagarkurnool dist
'గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి'

By

Published : Nov 4, 2020, 9:28 PM IST

గ్రామ పంచాయతీల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని పల్లెప్రగతి రాష్ట్ర పరిశీలకులు కృష్ణయ్య అన్నారు. నాగర్​కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని జిల్లెల, వేపూర్ గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలను నాటి సంరక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, డంపింగ్​యార్డుల్లో ఎప్పటికప్పుడు అభివృద్ధి పనులు సక్రమంగా నిర్వహించాలన్నారు. గ్రామాల సర్పంచులకు, యువజన సంఘాల సభ్యులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు జంగయ్య, మాధవి, ఉప సర్పంచ్ రాజు, ఎంపీటీసీ శోభా, గ్రామ కార్యదర్శులు తిరుపతయ్య, ఇందిర, యువజన సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:సన్నరకం వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టతనిచ్చిన ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details