నాగర్కర్నూల్ జిల్లా ఎల్లూరు గ్రామంలో నిర్మిస్తోన్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఫేజ్-1కు అదనంగా కావాల్సిన 50 ఎకరాల భూమికోసం భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు భూ సర్వే నిర్వహించారు. భూములను ఇవ్వడానికి రైతులు నిరాకరించడంతో పోలీసులను పిలిపించాల్సివచ్చిందని అధికారులు తెలిపారు.
జిల్లాలోని ఎల్లూరు గ్రామం వద్ద నిర్మిస్తోన్న పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి దశ కోసం అదనంగా 50 ఎకరాల భూమి అవసరం ఉంది. భూములను ఇవ్వాలని రైతులను అధికారులు కోరగా అందుకు వారు నిరాకరించారు. ఈ క్రమంలో అధికారులు భారీగా పోలీసులను బలగాలను రప్పించి భూ సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న కొందరు రైతులను పోలీసులు స్టేషన్కు తరలించారు.