తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే - నాగర్​కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి

రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నాగర్​కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

paddy purchase centers opened in nagar karnool by mla marri janardhan reddy
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

By

Published : Apr 17, 2020, 7:23 PM IST

గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వరి దిగుబడి పెరిగిందని నాగర్​కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి అన్నారు. నాగర్​కర్నూలు మండలంలోని గన్యాగులలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

పెద్ద ముదునూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ఎవరూ అధైర్యపడొద్దని, గ్రామాలకే వచ్చి కొనుగోలు చేసి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలిపారు.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details