తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్​ థియేటర్​ ప్రారంభం

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్​ థియేటర్​, ప్రసవాల గదులను ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్​రెడ్డి ప్రారంభించారు. కొల్లాపూర్​ అభివృద్ధికి అందరూ ముందుకు రావాలన్నారు.

ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్​ థియేటర్​ ప్రారంభం

By

Published : Jul 26, 2019, 5:03 PM IST

నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి పింఛన్​ మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు. అనంతరం కొల్లాపూర్​ ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన ఆపరేషన్ థియేటర్, ప్రసవాల గదులను ప్రారంభించారు. కొల్లాపూర్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, పేద ప్రజలకు వైద్య సేవలు అందించే ఆస్పత్రి అభివృద్ధి కోసం సాయం అందించాలన్నారు. మెరుగైన సేవల కోసం ఆస్పత్రిలో అదనపు సిబ్బంది నియామకం కోసం కృషిచేస్తానన్నారు.

ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్​ థియేటర్​ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details