తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి - BUS ACCIDENT IN TELANGANA

ఆర్టీసీ బస్సు ఢీకొని 70ఏళ్ల వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో జరిగింది.

OLD MAN DIED IN RTC BUS ACCIDENT IN JAGYTYAL
OLD MAN DIED IN RTC BUS ACCIDENT IN JAGYTYAL

By

Published : Mar 7, 2020, 2:04 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. దేవరకొండవైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అంబేడ్కర్ కూడలి వద్ద ఓ వృద్ధుడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రహదారిపై ట్రాఫిక్​ నిలిచిపోయింది.

ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బస్సు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను రద్దీని అదుపుచేశారు. మృతి చెందిన వృద్ధుడు తాడూరు మండలం ఆకునెల్లికుదురుకు చెందిన గంగిరెద్దుల పెంటయ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని డెబ్బై ఏళ్ల వృద్ధుడు మృతి

ఇవీ చూడండి:మద్యం దొంగలను పట్టించిన సీసీ కెమెరాలు

ABOUT THE AUTHOR

...view details