కరోనాతో చికిత్స పొందుతూ వృద్ధురాలైన భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త హఠాన్మరణం చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబడిపల్లి గ్రామానికి చెందిన ఎదుల బక్కమ్మ(65) వారం రోజుల క్రితం కొవిడ్ బారిన పడ్డారు. మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో అంబులెన్స్‌లో నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
కరోనాతో భార్య మృతి.. భర్త హఠాన్మరణం - old couple died of corona in ambadipally village
కరోనా బారిన పడిన భార్యాభర్తలు.. ఆ మహమ్మారికి బలయ్యారు. మొదటగా భార్య మృతి చెందిగా... ఆమె మరణాన్ని తట్టుకోలేని భర్త హఠాన్మరణం చెందారు. ఈ విషాద ఘటన నాగర్ కర్నూల్ జిల్లా అంబడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
కరోనాతో వృద్ధ దంపతులు మృతి
బక్కమ్మ మరణ వార్త విన్న బక్కయ్య(70) జీర్ణించుకోలేక హఠాన్మరణం చెందారు. ఇతనికీ కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయింది. దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ 4రోజుల్లో గ్రామంలో నలుగురు కరోనాతో మృతి చెందారు. గత పది రోజులుగా అక్కడ స్వచ్ఛంద లాక్‌డౌన్ పాటిస్తున్నారు.
ఇదీ చదవండి:స్వచ్ఛంద లాక్‌డౌన్ విధించుకుంటున్న గ్రామాలు