నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నూతన సబ్‌స్టేషన్ ప్రారంభించారు. దీని ద్వారా వ్యవసాయం కోసం ప్రత్యేకంగా మూడు ఫీడర్లు ఏర్పాటు చేసి మహాదేవునిపేట, బోయపూర్ గ్రామాలతో పాటు ఆయా గ్రామాల వ్యవసాయబోర్లకు నిరంతరం విద్యుత్ అందించేందుకు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
'రైతును రాజును చేయడమే ప్రభుత్వ ధ్యేయం'
రైతాంగం సంక్షేమం కోసం రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలతో పాటు ప్రతి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పని చేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా మహాదేవునిపేటలో ఆయన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు.
'రైతును రాజును చేయడమే ప్రభుత్వ ధ్యేయం'
వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు మర్రి జనార్దన్ రెడ్డి వెల్లడించారు. రైతును రాజును చేయడమే ప్రభుత్వ ధ్యేయమని.. రైతాంగం సంక్షేమం కోసం రైతుబంధు, రుణమాఫీ వంటి పథకాలతో పాటు ప్రతి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:దేశంలో మరో 9,985 కేసులు, 279 మరణాలు