మహిషాసుర మర్దిని అవతారంలో వాసవి కన్యకా పరమేశ్వరి - navaratri_celebrations_at_nagarkurnool
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కల్వకుర్తిలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మహిషాసుర మర్దిని అవతారంలో వాసవి కన్యకా పరమేశ్వరి
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. వేదపండితులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
మహిషాసుర మర్దిని అవతారంలో వాసవి కన్యకా పరమేశ్వరి