తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్వకుర్తి- నంద్యాల జాతీయ రహదారికి నంబరు కేటాయింపు - జాతీయ రహదారి నంబరు కేటాయింపు

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి- నంద్యాల జాతీయ రహదారికి నంబరు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. సోమశిల- సిద్ధేశ్వర వంతెన నిర్మాణానికి మార్గం సులభమయింది.

national highway number allotted to kalvakurthi road
కల్వకుర్తి- నంద్యాల జాతీయ రహదారికి నంబరు కేటాయింపు

By

Published : Nov 8, 2020, 7:17 AM IST

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి కల్వకుర్తి- నంద్యాల జాతీయ రహదారికి 167కే నంబరు కేటాయిస్తూ కేంద్రం ప్రభుత్వం జీవో జారీ చేయడం వల్ల సోమశిల- సిద్ధేశ్వర వంతెన నిర్మాణానికి మార్గం సుగమం అయింది. జాతీయ రహదారి, వంతెన నిర్మాణానికి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌ రెడ్డి.. కేంద్రానికి లేఖ రాశారు. నంబరు కేటాయింపు పట్ల ఎమ్మెల్యే వర్గం కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details