తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరు-రంగారెడ్డి పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై ఎన్జీటీ ఆరా - నాగర్​ కర్నూల్​ జిల్లా వార్తలు

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలపై ఎన్జీటీ దర్యాప్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్​లోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్ కమిటీ ఎల్లూరు వచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

national-green-tribunal
ఎన్జీటీ

By

Published : Sep 16, 2021, 7:57 AM IST

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ కమిటీ పరిశీలించింది. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా పర్యావరణం దెబ్బతింటుందనే ఫిర్యాదుపై కమిటీ సభ్యులు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వద్దకు వచ్చారు.

ఆంధ్రప్రదేశ్​లోని వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్ కమిటీ ఎల్లూరు వచ్చింది. పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలు జరిగాయో లేదో తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అక్కడ సొరంగం పనులు, నార్లాపూర్ దగ్గర అంజనగిరి రిజర్వాయర్ పనులను కమిటీ సభ్యులు పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణంపై అధికారులు కమిటీ సభ్యులకు, ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై కమిటీ బృందం జాతీయ హరిత ట్రైబ్యునల్​కు పూర్తిస్థాయి నివేదిక అందించనుంది.

ఇదీ చూడండి:NGT: 'నిపుణుల కమిటీ'పై ఎన్జీటీ అసహనం.. పర్యావరణ ఉల్లంఘనలపై నివేదికకు మరోసారి ఆదేశం

ABOUT THE AUTHOR

...view details