తెలంగాణ

telangana

ETV Bharat / state

అచ్చంపేట: నామినేషన్​ నుంచి ఫలితాల వరకు ఎన్నికల రిపోర్ట్​ - achampet municipality elections results

నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట పురపాలిక తెరాస కైవసమైంది. మొత్తం 20 వార్డులకు గానూ... ఏకంగా 13 వార్టుల్లో గులాబీ జెండా ఎగిరింది. కాంగ్రెస్-06, భాజపా-1 స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగాయి.

naminations-to-results-achampet-municipality-elections
naminations-to-results-achampet-municipality-elections

By

Published : May 3, 2021, 10:49 PM IST

అచ్చంపేట పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. అచ్చంపేట పురపాలికలో 20వార్డులకు ఎన్నికలు జరిగాయి. 20 వార్డులకు గాను తెరాస-20, కాంగ్రెస్-20, భాజపా-20 వార్డుల్లో పోటీ చేయగా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. 20 వార్డుల్లో తెరాస-13, కాంగ్రెస్-06, భాజపా-1 స్థానాన్ని గెలుచుకున్నాయి. అచ్చంపేట మున్సిపాలిటీలో మొత్తం ఓట్లు 20684 ఉండగా... 14230 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లలో తెరాసకు 7336, కాంగ్రెస్ కు 4873, భాజపాకు 1681 ఓట్లు దక్కాయి. 213 ఓట్లు చెల్లకుండా పోగా... 80 మంది నోటాకు ఓటేశారు. పోటీ చేసిన అభ్యర్థుల్లో ఐదో వార్డు తెరాస అభ్యర్థి లావణ్యకు అత్యధికంగా 428 ఓట్ల ఆధిక్యం దక్కగా... 13 ఓట్లతో 19వ వార్డు తెరాస అభ్యర్థి శైలజకు అత్పల్ప ఆధిక్యం దక్కింది.

అచ్చంపేట ఎన్నికల ఎన్నికల ముఖచిత్రం

ఏ పార్టీకి ఎన్ని స్థానాలు:

అచ్చంపేట మొత్తం వార్డులు 20
తెరాస గెలుచుకున్నది 13
కాంగ్రెస్ గెలుచుకున్నది 06
భాజపా గెలుచుకున్నది 01

ఏ పార్టీకి ఎన్ని ఓట్లు:

అచ్చంపేటలో మొత్తం ఓట్లు 20684
పోలైన ఓట్లు 14230
తెరాసకు దక్కిన ఓట్లు 7336
కాంగ్రెస్ కు దక్కిన ఓట్లు 4873
భాజపాకు దక్కిన ఓట్లు 1681
చెల్లనివి 213
నోటా 80

అత్యధిక అధిక్యం- 428 (ఐదో వార్డు)

అత్యల్ప ఆధిక్యం- 13

వార్డు - అభ్యర్ధిపేరు పార్టీ - అధిక్యం

  1. గౌరీశంకర్ కాంగ్రెస్-131
  2. నిర్మల తెరాస-378
  3. సోమ్లా తెరాస-58
  4. మెహరాజ్ బేగం తెరాస-116
  5. లావణ్య తెరాస-428
  6. రమేష్ తెరాస-149
  7. నూరీబేగం కాంగ్రెస్-125
  8. చిట్టెమ్మ కాంగ్రెస్-241
  9. సుగుణమ్మ భాజపా-17
  10. సునిత కాంగ్రెస్-128
  11. సంధ్య కాంగ్రెస్-13
  12. ఖాజాబీ తెరాస-284
  13. శివకృష్ణ- తెరాస-76
  14. శ్రీనివాసులు కాంగ్రెస్-22
  15. మనోహర ప్రసాద్ తెరాస-161
  16. నర్సింహా గౌడ్ -తెరాస- 405
  17. శ్రీను తెరాస-91
  18. శివ తెరాస-237
  19. శైలజ తెరాస-13
  20. రమేష్ రావు తెరాస-182

ఇదీ చూడండి: చావునైనా భరిస్తా... ఆత్మగౌరవం కోల్పోను: ఈటల రాజేందర్

ABOUT THE AUTHOR

...view details