నాగర్ కర్నూల్ జిల్లాలో వానాకాలంలో నూతన నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలెక్టర్ శ్రీధర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వానాకాలంలో ఈ ఏడాది ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలని ప్రణాళికలు రూపొందించిన జాబితాపై ప్రజాప్రతినిధులతో చర్చించారు. జిల్లాలో రైతులెవ్వరూ మొక్కజొన్న వేయవద్దని... కంది, సన్న రకం వరిని పండించాలని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో కూరగాయల సాగును చేపట్టాలని తెలిపారు.
మొక్కజొన్న వద్దు... కంది, వరి ముద్దు: కలెక్టర్ - Nagrkarnool Collector Sridhar
నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సారి వానాకాలంలో మొక్కజొన్న పంట వేయవద్దని... కంది, సన్న రకం వరిని పండించాలని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో 60 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంటలు పండించడానికి సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాల్లో గోదాములు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో రైతు సమితి సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని దీనిలో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ పద్మావతి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, కుచకుల్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, పార్లమెంట్ సభ్యులు రాములు, జిల్లా ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.