జడ్పీ ఛైర్‌పర్సన్‌కు చుక్కెదురు.. ఎన్నిక చెల్లదన్న కోర్టు.. కారణమదే! - telakapally ZP Chairperson Peddapalli Padmavathi election invalid
![జడ్పీ ఛైర్‌పర్సన్‌కు చుక్కెదురు.. ఎన్నిక చెల్లదన్న కోర్టు.. కారణమదే! Nagarkurnool Senior Civil Judge Court says telakapally ZP Chairperson Peddapalli Padmavathi election invalid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15822794-thumbnail-3x2-kee.jpeg)
16:24 July 14
జడ్పీ ఛైర్‌పర్సన్ పద్మావతికి కోర్టులో చుక్కెదురు
నాగర్‌కర్నూలు జడ్పీ ఛైర్‌పర్సన్ పెద్దపల్లి పద్మావతికి కోర్టులో చుక్కెదురైంది. తెలకాపల్లి జడ్పీటీసీగా పద్మావతి ఎన్నిక చెల్లదని నాగర్‌కర్నూలు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తీర్పును వెలువరించింది. పద్మావతికి ముగ్గురు సంతానం ఉండటం వల్ల ఎన్నిక చెల్లదని కోర్టు పేర్కొంది.
2019లో జరిగిన ఎన్నికల్లో పద్మావతి తెలకపల్లి స్థానం నుంచి తెరాస తరఫున పోటీ చేసి జడ్పీటీసీగా గెలుపొందారు. పద్మావతికి ముగ్గురు పిల్లలున్నారని సమీప ప్రత్యర్థి సుమిత్ర కోర్టును ఆశ్రయించారు. ఆమె నామినేషన్ తిరస్కరించాలని కోరగా రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. నాగర్‌కర్నూలు కోర్టును కాంగ్రెస్ నాయకురాలు సుమిత్ర ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆమె ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. దీనితో రెండో అభ్యర్థిగా ఉన్న సుమిత్రను జడ్పీటీసీగా కొనసాగాలని ఆదేశించింది.
ఇవీ చదవండి: