ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌లో అద్దె చెల్లించకుండా ఉన్నవారి స్థానంలో కొత్త వారికి దుకాణాలను కేటాయిస్తామని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డీఆర్‌వో మధుసూదన్ నాయక్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌ను తనిఖీ చేశారు.
'అద్దె సక్రమంగా చెల్లించకుంటే కొత్త వారికి ఇస్తాం' - nagarkurnool district latest news
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌ను జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డీఆర్‌వో మధుసూదన్ తనిఖీ చేశారు. అద్దె సక్రమంగా చెల్లించని వారికి నోటీసులు జారీ చేశారు. అద్దె చెల్లించకుంటే ఆ దుకాణాలను కొత్తవారికి కేటాయిస్తామని పేర్కొన్నారు.
nagarkurnool
51 ఎస్సీల దుకాణాలకు సంబంధించి గత ఐదేళ్లుగా అద్దెలు చెల్లించడం లేదని... రూ.23 లక్షలు కార్పొరేషన్‌కు బకాయి పడ్డారని తెలిపారు. వారందరికీ నోటీసులు జారీ చేశారు. అద్దె చెల్లించకుంటే కొత్తవారికి ఈ దుకాణాలను కేటాయిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ