Nagarkurnool Police Arrested Tantrik For killed 11 people : 2020 నుంచి ఇప్పటి వరకూ వరుసగా 11మంది అమాయకులను గుప్త నిధుల పేరిట కిరాతకంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్ సత్యనారాయణ అలియాస్ సత్యం యాదవ్‌ను నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన 8కేసుల్లో 11మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ మేరకు నిందితుని హత్యోదంతాలను జోగులాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహన్ మీడియాకు వెల్లడించారు.
DIG Chouhan Revealed Serial Killer Crime :నాగర్‌కర్నూల్ ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పోలీసుల కథనం ప్రకారం నిందితుడు క్షుద్రపూజలు చేసి గుప్తనిధులు వెలికి తీస్తానని నమ్మించి అమాయకుల నుంచి తొలత డబ్బులు కాజేస్తాడు. డబ్బులు లేవంటే ఇండ్లస్థలాలు(House sites), భూములు తన పేరుమీద రాయించుకుంటాడు. ఆ తర్వాత పూజల పేరుతో వారిని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్తాడు. తీర్ధం పేరుతో గుర్తుతెలియని రసాయనాలు కలిపిన విషాన్నివారిచేత తాగిస్తాడు.
నాగర్‌కర్నూల్‌లో నరహంతకుడు - మాయమాటలు చెప్పి 11 మందిని హతం
బాధితులు అపస్మారక స్థితికి వెళ్లాక వారిపై యాసిడ్ పోసి లేదంటే బండరాళ్లు మోపి హత్య చేస్తాడు. అలా 2020 నుంచి ఇప్పటి వరకూ మహిళలు సహా 11మందిని హతమార్చినట్లు డీఐజీ వెల్లడించారు. నిందితుని నుంచి హత్యకు గురైన వ్యక్తులకు చెందిన 5 సెల్ ఫోన్లు, నిందితుడు వినియోగించిన 8 సెల్ ఫోన్లు,10 సిమ్ కార్డులు, ఓ కారు, విష రసాయానాలున్న డబ్బాలు, ఎలక్ట్రికల్ డిటోనేటర్లను(Electric Detonators) స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
Man Killed 11 Members in Nagarkurnool : 2020 నుంచి హత్యలు చేస్తున్న నిందితుడు చివరకు ఓ వ్యక్తి అదృశ్యం కేసు దర్యాప్తులో పోలీసుల చేతికి చిక్కాడు. హైదరాబాద్ లంగర్ హౌజ్‌కు చెందిన గోవుల లక్ష్మి భర్త వెంకటేష్, నాగర్ కర్నూల్లో సత్యంయాదవ్ కలిసి వస్తానని చెప్పి, 5రోజులుగా తిరిగి రాలేదు. దీంతో ఆమె నేరుగా నాగర్ కర్నూల్‌కు వచ్చి సత్యనారాయణను నిలదీయగా సరైన సమాధానం ఇవ్వలేదు. అనుమానం వచ్చిన ఆమె నాగర్ కర్నూల్ పోలీసు స్టేషన్ లో వెంకటేశ్ కనిపించడం లేదంటూ కేసు నమోదుచేశారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు సత్యనాయరణ ప్రవర్తనపై అనుమాన పడ్డారు. నిందితుడు చాలాకాలంగా స్థిరాస్థి వ్యాపారం, నాటువైద్యంతో గుప్త నిధులవేట సాగించేవాడు.
జగిత్యాలలో బాలుడి అపహరణకు యత్నం - నిందితుడికి దేహశుద్ధి
క్షుద్రపూజలు చేసి గుప్తనిధులను వెలికి తీస్తానని నమ్మించేవాడు. ఆ మాటలు నమ్మిన వెంకటేశ్ గుప్తనిధులు(Hidden Treasures) వెలికి తీసేందుకు సత్యనారాయణను సంప్రదించారు. డబ్బిస్తే చేస్తానని అంగీకరించిన సత్యనారయణ ఒంటరిగా వస్తేనే చేస్తానని వెంకటేశ్‌కు షరతు విధించాడు. అందుకు వెంకటేశ్ సహా అతని స్నేహితులు అంగీకరించారు. గుప్తనిధుల్ని కనిపెట్టాలంటే తానిచ్చిన మూలికల్ని చెప్పినచోట ఉంచి రావాలని పలుమార్లు వెంకటేశ్ ను వివిధ ప్రాంతాలకు పంపి కాలం గడిపాడు.