వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని తెల్కపల్లి, తాడూరు, బిజినపల్లి మండల కేంద్రాలతో పాటు నాగర్కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా రైతులను ఆదుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది.. తెలంగాణ ఒక్కటేనని ఆయన తెలిపారు.
వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే - nagarkurnool district news
నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాలతో పాటు తూడుకుర్తి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టం వల్ల రైతులకు ఒరిగేది ఏమీ లేదని ఆయన విమర్శించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ముందు మంచిగా ఆరబెట్టుకుని తీసుకురావాలన్నారు. అప్పుడే వారికి సరైన ధర లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారితో, అధిక వర్షాలతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ పద్మావతి, అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'రైతు అభివృద్ధిలోకి వస్తేనే... దేశాభివృద్ధి ముందుకు సాగుతుంది'
TAGGED:
paddy procurement