ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధునీకరణ పనులకు జిల్లా కలెక్టర్ శర్మన్, ట్రస్ట్ డైరెక్టర్ మర్రి జమునా రాణితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తమ ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నామని వాటికి సంబంధించిన డిజైన్లను విడుదల చేశారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ట్రస్ట్ ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.
'ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దడమే లక్ష్యం' - నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక ప్రభుత్వ పాఠాశాలను ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సర్వాంగసుందరం తీర్చుదిద్దుతామని ఎమ్మెల్యే మర్ర జనార్దన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
విద్యార్థులకు కావలసిన సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్, మైదానం, టాయిలెట్స్ ,డిజిటల్ క్లాస్, లైబ్రరీ, ఫర్నిచర్ ఇవన్నీ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మర్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని ఎమ్మెల్యే మర్రి ఆధునీకరించడం హర్షించదగ్గ విషయమని కలెక్టర్ శర్మన్ తెలిపారు. అనంతరం తిమ్మాజిపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన దుకాణ సముదాయాలకు శంకుస్థాపన చేశారు
ఇవీ చూడండి: 'ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తెరాస లక్ష్యం'