తెలంగాణ

telangana

ETV Bharat / state

18 గ్రామాల సర్పంచులకు షోకాజ్‌ నోటీసులు - నాగర్​ కర్నూల్​ జిల్లా తాజా వార్తలు

అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శించిన 18 గ్రామాల సర్పంచులకు నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్‌ షేక్ యాస్మిన్ బాష షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిపై ఆరా తీశారు. హరితహారం కార్యక్రమాన్ని వేగవంతంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

18 గ్రామాల సర్పంచులకు షోకాజ్‌ నోటీసులు
18 గ్రామాల సర్పంచులకు షోకాజ్‌ నోటీసులు

By

Published : Jun 30, 2020, 10:50 PM IST

అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శించిన 18 గ్రామాల సర్పంచులకు నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్‌ షేక్ యాస్మిన్ బాష షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా అధికారులతో సమీక్షించిన ఆమె.. హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిపై ఆరా తీశారు. హరితహారం కార్యక్రమాన్ని వేగవంతంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 11.9 శాతం మాత్రమే మొక్కలను నాటడం జరిగిందని 100 శాతం మొక్కలను నాటాలని యాస్మిన్‌ స్పష్టం చేశారు. జిల్లాలో పూర్తి చేసిన డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలకు కాంపౌండ్ వాల్ మాదిరిగా మూడంచెల మొక్కలు నాటాలన్నారు. ప్రతి గ్రామంలో 100 శాతం మొక్కలు నాటే సంరక్షించే బాధ్యత సర్పంచ్‌, కార్యదర్శులదే అని వెల్లడించారు.

ఇదీ చదవండి:1 లేదా 2న రాష్ట్ర కేబినెట్ భేటీ? లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details