కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ అవగాహన కల్పించారు. సాధ్యమైనంత వరకు ప్రజలు ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 14 రోజుల వరకు గృహనిర్బంధంలో ఉండాలని పేర్కొన్నారు.
'అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి' - కరోనాపై కలెక్టర్ శ్రీధర్ అవగాహన
ప్రజలంతా వ్యక్తిగత శుభ్రత పాటించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచించారు. అత్యవసర పరిస్థితిలుంటేనే బయటకు రావాలని జిల్లా వాసులకు తెలిపారు.
'అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రండి'
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజల్లో ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లైతే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని సూచించారు. శానిటైజర్లు వినియోగించాలని, మాస్కులు ధరించి కరోనా వైరస్ దరిచేరకుండా జాగ్రత్తపడాలని అన్నారు.
- ఇదీ చూడండి :కరోనా ఎఫెక్ట్: రేపు కరీంనగర్లో సీఎం పర్యటన