గ్రామాల్లో పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని జిల్లా పాలనాధికారి ఎల్.శర్మాన్ చౌహాన్ పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. కొన్ని గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడం వల్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో అలసత్వం ప్రదర్శించవద్దని సెప్టెంబరు నెలాఖరుకు పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
'గ్రామాల్లో స్వచ్ఛత లోపిస్తే చర్యలు తప్పవు: జిల్లా కలెక్టర్ - తెలకలపల్లి మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
గ్రామాల్లో స్వచ్ఛత లోపిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శర్మాన్ చౌహాన్ పేర్కొన్నారు. తెలకలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఆకస్మికంగా పర్యటించారు.
'గ్రామాల్లో స్వచ్ఛత లోపిస్తే చర్యలు తప్పవు'
మండలంలోని తెలకపల్లి దాసు పల్లి, అనంతసాగర్, గట్టురాయిపాకుల, గడ్డంపల్లి, పెద్దూరు గ్రామాల్లో పర్యటించారు. ప్రగతి వనం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డ్ పనులను పర్యవేక్షించారు. తెలకపల్లి గ్రామంలో మురుగు కాలువల నిర్వహణ సరిగా లేదని సర్పంచ్, కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట డీఎల్పీ పీవో రామ్మోహన్రావు, గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు ఉన్నారు.