ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ నాగర్కర్నూల్ జిల్లాలో రాష్ట్రస్థాయి శిక్షణ ప్రారంభించడం శుభ పరిణామమన్నారు కలెక్టర్ శ్రీధర్. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారికి ఆయన స్వాగతం తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ బ్రాంచ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో రాష్ట్ర స్థాయి సోషల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాలంటీర్ ఐదు రోజుల శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
'సామాజిక స్పృహ ఉండేలా తీర్చిదిద్దాలి' - collector sridhar on red cross socity
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ బ్రాంచ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో రాష్ట్ర స్థాయి సోషల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాలంటీర్ ఐదు రోజుల శిక్షణ శిబిరాన్ని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రారంభించారు.

'సామాజిక స్పృహ ఉండేలా తీర్చిదిద్దాలి'
ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఎమర్జెన్సీ సమయంలో ఎలా స్పందించాలి అనే అంశాలతో పాటు.. సామాజిక స్పృహ కలిగి ఉండేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని సూచించారు. జూనియర్, యూత్ రెడ్ క్రాస్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలో విద్యార్థిని విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నారు.
నాగర్కర్నూల్లో శిక్షణ శిబిరం
ఇవీచూడండి: 'బకాయిల చెల్లింపులతో రాష్ట్రాలకు ఊతమివ్వండి'