తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ - collector sharman inspected paddy purchase center

ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షణించకుండా.. త్వరగా కొనుగోలు చేసి పంపాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ అధికారులను ఆదేశించారు.

collector sharman inspected paddy purchase center
కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

By

Published : May 19, 2021, 9:25 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ యల్. శర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అకాల వర్షాలు పడుతున్నందున కొనుగోలు చేసిన ధాన్యం తడిసిపోకుండా ఎప్పటికప్పుడే మిల్లులకు తరలించాని అధికారులకు సూచించారు. ధాన్యం రవాణాకు సరిపడా లారీలు పెట్టాల్సిందిగా తహసీల్దార్​ను ఆదేశించారు.

ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, టార్పాలిన్లు, గున్ని బ్యాగులు తగినన్ని ఉన్నాయా లేవా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని, ధాన్యం కొనుగోలు సజావుగానే కొనసాగుతున్నట్లు కొనుగోలు కేంద్ర సిబ్బంది కలెక్టర్​కు వివరించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. యజమానులతో ధాన్యం తరలింపు గురించి కలెక్టర్ మాట్లాడారు.

ఇదీ చదవండి:కొవిడ్ బాధితులకు సీఎం భరోసా.. నేనున్నానంటూ అభయహస్తం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details