రైతు వేదికల నిర్మాణంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని నాగర్కర్నూల్ జిల్లా ఇంఛార్జి కలెక్టర్ యాస్మన్ బాష హెచ్చరించారు. రైతు వేదికల నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
'రైతు వేదిక నిర్మాణ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు' - తెలంగాణ వార్తలు
రైతు వేదికల నిర్మాణ పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఇంజినీరింగ్ అధికారులకు నాగర్ కర్నూల్ జిల్లా ఇంఛార్జి కలెక్టర్ యాస్మిన్ బాష షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రైతు వేదికల నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు.
'రైతు వేదిక నిర్మాణ పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు'
జిల్లాలో నిర్మిస్తున్న 143 రైతు వేదికల పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీక్షించారు. అధికారులకు పలు సూచనలిచ్చారు. నిర్మాణ పనుల్లో అలసత్వం వహించిన పెద్దకొత్తపల్లి, బల్మూరు, వెల్ధండ, లింగాల మండలాలకు చెందిన నలుగురు ఇంజినీరింగ్ ఏఈ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈనెల 18 నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: 'ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటాం'