తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆఊరి యువత లక్ష్యం.. అయితే జవాను, లేదంటే పోలీసు - నాగర్​కర్నూల్​ జిల్లా గోడల్​, తోడెళ్ల గడ్డ యువత వార్తలు

దేశసేవ చేయడం ఓ గొప్ప అనుభూతి. సైన్యం, పోలీసు, రక్షణ రంగాల్లో పనిచేస్తూ ప్రత్యక్షంగా సేవలు అందించేవారు ఊరికి ఒకరో..ఇద్దరో ఉంటారు. కానీ... నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని రెండు గ్రామాల్లో ఏకంగా 42 మంది ఆర్మీ, పోలీస్‌ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. జవాను ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుంటున్న ఆ రెండు గ్రామాలపై కథనం.

అయితే జవాను, లేదంటే పోలీసు... ఇదే ఆఊరి యువత లక్ష్యం
అయితే జవాను, లేదంటే పోలీసు... ఇదే ఆఊరి యువత లక్ష్యం

By

Published : Dec 25, 2020, 11:33 PM IST

అయితే జవాను, లేదంటే పోలీసు... ఇదే ఆఊరి యువత లక్ష్యం

జవాను, పోలీస్‌... ఇదే ఆ గ్రామాల్లోని యువకుల లక్ష్యం. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలంలోని గోడల్‌, తోడెళ్ల గడ్డ గ్రామాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ రెండు గ్రామాల నుంచి 42 మంది సైన్యం, బీఎస్​ఎఫ్​, సీఆర్​పీఎప్​, పోలీసు శాఖలకు ఎంపికయ్యారు. గోడల్ గ్రామంలో 14 మంది రక్షణ, 10 మంది పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. తోడేళ్లగడ్డలో 11 మంది రక్షణ శాఖలో సేవలందిస్తుండగా..... ఏడుగురు పోలీసులుగా ప్రజలకు భద్రత కల్పిస్తున్నారు. ఈ గ్రామాల్లో యువకులు... చిన్నతనం నుంచే దేశసేవే లక్ష్యంగా సన్నద్ధమవుతుంటారు. ప్రజారక్షణలో ప్రత్యక్షంగా భాగస్వాములు కావడం తమకు గొప్ప అనుభూతి పంచుతుందని వారు చెబుతున్నారు.

యువతలో స్ఫూర్తి నింపిన ఈశ్వర్​..

యువకుల్లో స్ఫూర్తిని పెంచడంలో.... స్థానికుడైన జవాను ఈశ్వర్‌ కృషి ఎంతో ఉందని అక్కడి వారు చెబుతున్నారు. ఆరేళ్లపాటు సైన్యంలో సేవలందించి ఈశ్వర్... దురదృష్టవశాత్తు రెండేళ్ల కిందట ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది యువకులు ఆర్మీ, పోలీసు ఉద్యోగాల కోసం శ్రమిస్తున్నారు. వేరే ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉన్నా... తమ పిల్లలు దేశసేవలో భాగం కావడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

సేవే లక్ష్యంగా..

గ్రామంలోని యువకులకు ఆర్మీ, పోలీసు తప్ప వేరే లక్ష్యమే ఉండదని స్థానికులు చెబుతున్నారు. ప్రజలకు సేవలందించే ఉద్యోగాల కోసం నిరంతరం శ్రమిస్తారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంకోసం జవాన్లను తయారుచేస్తున్న గోడల్‌, తోడెళ్ల గడ్డ గ్రామాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ఇదీ చూడండి:పండుగలు ఇంట్లోనే జరుపుకోండి: ఈటల

ABOUT THE AUTHOR

...view details