నాగర్ కర్నూల్ జిల్లా మంతటి గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ శర్మన్ ప్రారంభించారు. రక్తదానం అంటే ప్రాణదానమని అన్నారు. రక్త దానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.
'రక్త దానం వల్ల ఎంతో మందిని కాపాడవచ్చు' - రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ శర్మన్
రక్త దానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ విజ్ఞప్తి చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 391వ జయంతిని పురస్కరించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్నిఆయన ప్రారంభించారు. రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని కలెక్టర్ తెలిపారు.
'రక్త దానం వల్ల ఎంతో మందిని కాపాడవచ్చు'
రక్తదానం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని శర్మన్ తెలిపారు. ప్రతి ఒక్కరు రక్త దాతలుగా మారాలని కోరారు. రక్తం దానం చేసిన వారికి రెడ్ క్రాస్ తరఫున ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం వారికి పండ్లు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల