తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్ మానవత్వం.. వృద్ధుడిని ఆసుపత్రికి తరలించిన శర్మన్

వృద్ధుడు మురుగు కాలువ అరుగుపై పడుకున్న దృశ్యం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్​ను కలచివేసింది. కారు ఆపి అతని దగ్గరికి వెళ్లారు. జ్వరంతో బాధపడుతున్నాడని గమనించి అల్పాహారాన్ని అందించారు. ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.

nagar kurnool district collector humanity on old man
కలెక్టర్ మానవత్వం.. వృద్ధుడిని ఆసుపత్రికి తరలింపు

By

Published : Jan 2, 2021, 6:59 PM IST

కార్యాలయ ఆవరణలో జ్వరంతో బాధపడుతున్న వృద్ధుడిని ఆసుపత్రికి తరలించి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్​ శర్మన్ మానవత్వాన్ని చాటుకున్నారు. వైద్యుడితో ఫోన్​లో మాట్లాడిన కలెక్టర్.. అతడికి మెరుగైన వైద్యం అందించి తన స్వగ్రామానికి పంపించాలని ఆదేశించారు.

కలెక్టర్ మానవత్వం.. వృద్ధుడిని ఆసుపత్రికి తరలింపు

కలెక్టర్​ తన కార్యాలయానికి వస్తున్న తరుణంలో కార్యాలయ సమీపంలో 70ఏళ్ల వృద్ధుడు మురికి కాలువ అరుగుపై పడుకుని ఉండడాన్ని గమనించారు. కారు ఆపి అతని దగ్గరికి వెళ్లి వివరాలను సేకరించారు. అతను నాగర్ కర్నూల్ మండలం దేశి ఇటిక్యాల గ్రామానికి చెందిన నరసింహగా గుర్తించారు. జ్వరంతో బాధపడుతున్నాడని గమనించి తానే డబ్బులు ఇచ్చి అల్పాహారాన్ని అందించారు. అంబులెన్స్​లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:'కేంద్ర నిధులతోనే పంచాయతీల్లో అభివృద్ధి.. కేసీఆర్ ఇచ్చింది శూన్యం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details