నల్లమల అడవుల్లో చెలరేగిన మంటల్లో చిక్కుకుని మరణించిన చెంచు వ్యక్తి కుటుంబానికి రూ.50 లక్షలు, గాయపడిన వారికి రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని... డీసీసీ అధ్యక్షుడు వంశీక్రిష్ణ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల అడవుల్లో ఈ నెల 7వ తేదీన మల్లాపూర్ పెంట సమీపంలో చెలరేగిన మంటల్లో చిక్కుకుని ఏడుగురు చెంచులు గాయపడ్డారు. వారిలో ఐదుగురిని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి... తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
'చెంచుల పట్ల ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు'
నల్లమల అడవుల్లో చెలరేగిన మంటల్లో గాయపడిన చెంచుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని... నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వంశీక్రిష్ణ విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వారికి కార్పొరేట్ వైద్యం ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. మరణించిన చెంచు వ్యక్తి కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మంటల్లో తీవ్రంగా గాయపడిన నిమ్మల లింగయ్య(38) అనే వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారని... వంశీక్రిష్ణ పేర్కొన్నారు. గాయపడిన చెంచుల పట్ల ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వారికి కార్పొరేట్ వైద్యం ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. ఆయనకు గుప్త నిధులపై ఉన్న ప్రేమ చెంచులపై లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నల్లమలలో ఎక్కువ మంది అగ్నిమాపక సిబ్బందిని నియమించాలని అన్నారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలి: ఉత్తమ్