పురపాలికలో శుక్రవారం జరగునున్న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ అధికారులకు సూచించారు. అచ్చంపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన తనిఖీ చేశారు.
'ఛైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయండి' - జిల్లా కలెక్టర్ శర్మన్
రేపు జరగనున్న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నికకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ అధికారులను ఆదేశించారు. అచ్చంపేటలోని బాలికల పాఠశాలలో జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్
మున్సిపల్ వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తక్కువ మంది మీడియా ప్రతినిధులను అనుమతించాలని ఆదేశించారు. పట్టణంలో నాటిన మొక్కలను పరిరక్షించాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. అక్కడ కరోనా నిర్ధరణ కోసం గుంపులుగా ఉన్న ప్రజలను చూసి పరీక్షా కేంద్రాన్ని ప్రభుత్వ పాఠశాలకు మార్చాలని జిల్లా పాలనాధికారి శర్మన్ అధికారులకు సూచించారు.