నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో కలెక్టర్ ఎల్. శర్మన్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 5.30కే అధికారులతో కలి పట్టణంలోనిన పలు వార్డుల్లో పర్యటించారు. బస్టాండు, కూరగాయల మార్కెట్, పలు వార్డుల్లో మార్నింగ్ వాక్ చేస్తూ... చిరువ్యాపారులతో ముచ్చటించారు. ప్రభుత్యం అందించే రుణ సహాయం గురించి వివరించారు. ప్రతి ఒక్కరు రుణ సదుపాయం వినిగించుకోవాలన్నారు.
కొల్లాపూర్‌లో కలెక్టర్ శర్మన్ ఆకస్మిక పర్యటన - nagar kurnool collector sharman latest news
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో కలెక్టర్ శర్మన్ పర్యటించారు. అక్రమంగా నిర్మిస్తున్న వెంచర్లను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
![కొల్లాపూర్‌లో కలెక్టర్ శర్మన్ ఆకస్మిక పర్యటన collector sharman visited kollapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8084251-684-8084251-1595137526782.jpg)
కొల్లాపూర్‌లో కలెక్టర్ శర్మన్ ఆకస్మిక పర్యటన
ప్రధాన రోడ్డుపై వర్తకులు చెత్తాచెదారం వేయకుండా చూడాలని.. అలా వేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని కమిషనర్‌ను ఆదేశించారు కలెక్టర్ శర్మన్. పట్టణంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, పరిశుభ్రతలకు అధిక ప్రాధాన్యతనిచ్చి కొల్లాపూర్‌ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని మున్సిపల్ ఛైర్మన్, కమిషనర్‌కు తెలిపారు.
ఇవీ చూడండి:'ఒక్కసారి మా నాన్నను చూడనివ్వండి.. ప్లీజ్'