తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామీణాభివృద్ది పనుల్లో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్​ హెచ్చరిక

నాగర్​కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో.. కలెక్టర్ శర్మన్​చౌహన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ఏవిధంగా జరుగుతున్నాయో అధికారులనడిగి ఆరా తీశారు.

Nagar Kurnool Collector Sharman conducts inspections in Bijnapally
గ్రామీణాభివృద్ది పనుల్లో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్​ హెచ్చరిక

By

Published : Dec 29, 2020, 1:37 PM IST

గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోన్న సర్పంచ్, కార్యదర్శి, ఎంపీఓలకు నోటీసులు జారీ చేయాలంటూ.. నాగర్​కర్నూల్ జిల్లా పంచాయతీ శాఖాధికారిని కలెక్టర్ శర్మన్ ఆదేశించారు. బిజినపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారులు రోజువారీగా పనులు చేస్తున్నారో లేదో.. ఆయా గ్రామల ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

మండలంలోని మంగనూరు, వెలుగొండ, లింగసానిపల్లి గ్రామాల్లో పారిశుధ్య పనులను కలెక్టర్​ పర్యవేక్షించారు. మంగనూరు గ్రామంలో గ్రీన్ బడ్జెట్ కింద రూ. 11 లక్షల కేటాయింపులు ఉన్నా.. ఖర్చు చేయకపోవడంపై అధికారులను నిలదీశారు. కంపోస్ట్ షెడ్, వైకుంఠధామం నిర్మాణ పనులు మధ్యలోనే నిలిపివేయడంపై.. సర్పంచ్, కార్యదర్శుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, హరితహారం, నర్సరీల పెంపకాల్లో.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.

ఇదీ చదవండి:'ప్రతీవారం ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటించాలి'

ABOUT THE AUTHOR

...view details