నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలోని ప్రభుత్వ కార్యాలయాలను కలెక్టర్ చౌహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎంఈఓ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో చెత్త ఉండటం గమనించిన కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవరణలో కచ్చితంగా మొక్కలు నాటుకోవాలని అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్ - ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మన్ చౌహాన్ సూచించారు. కార్యాలయాల ఆవరణలో మొక్కలను నాటాలని చెప్పారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
ప్రభుత్వ కార్యాలయాల ముందు ఉన్న దుకాణ సముదాయాలను పరిశీలించి వారు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు.