తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులకు అవగాహన కల్పించాల్సింది ఏఈఓలే' - 'రైతులకు అవగాహన కల్పించాల్సింది ఏఈఓలే'

పంట మార్పిడి నియంత్రిత సాగు విధానంపై రైతులకు అవగాహన కల్సించాల్సి బాధ్యత రైతు బంధు సమితి, వ్యవసాయ శాఖ, ప్రజాప్రతినిధులదేనని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.

nagar kurnool farmers meeting
'రైతులకు అవగాహన కల్పించాల్సింది ఏఈఓలే'

By

Published : May 23, 2020, 9:01 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో మండల రైతు బంధు సమితి సభ్యులు, మండల వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ శ్రీధర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన వ్యవసాయ విధానాన్ని రైతులకు ఏఈవోలు వివరించాలని కలెక్టర్ సూచించారు. రైతుల వద్దకు వెళ్లి ఏ పంట వేస్తున్నారో తెలుసుకుని... వారికి అవగాహన కల్పించారు.

ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పంట వేశారనే నివేదిక తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా వారీగా అగ్రికల్చర్ కార్డును రూపొందించాలని... అందుకు అనుగుణంగానే పంటలు వేయాలన్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు క్లస్టర్ల వారీగా అన్ని మండలాల్లో రైతు సదస్సులు నిర్వహించాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి:'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details