తెలంగాణ

telangana

ETV Bharat / state

'అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపండి'

నాగర్​ కర్నూల్ అదనపు కలెక్టర్.. కలెక్టరేట్​లో మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అనుమతులు లేకుండా చేపడుతోన్న నిర్మాణాలను సకాలంలో గుర్తించాలని మున్సిపల్ కమిషనర్​లను ఆదేశించారు. అక్రమ కట్టడాలపై వారికి పలు సూచనలు చేశారు.

By

Published : May 11, 2021, 2:52 PM IST

nagar karnool joint collector
nagar karnool joint collector

మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాల్సిన పూర్తి బాధ్యత మున్సిపల్ కమిషనర్లదేనని నాగర్​ కర్నూల్ అదనపు కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు. కలెక్టరేట్​లో.. మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్రమ కట్టడాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

అనుమతులు లేకుండా చేపడుతోన్న నిర్మాణాలను సకాలంలో గుర్తించి.. వంద శాతం పెనాల్టీ వేయడం లేదా కూల్చివేతకు ఆదేశాలివ్వాలని మున్సిపల్ కమిషనర్​లను మనుచౌదరి ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో.. ఇప్పటికే ఎన్ఫోర్స్​మెంట్ టీమ్​లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆయా బృందాల్లో.. ఓ రెవెన్యూ అధికారి, పోలీస్, ఫైర్, ఆర్ అండ్ బీ అధికారులు ఉంటారని వివరించారు.

75 చదరపు గజాల వరకు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అనుమతి అవసరం లేదన్న అదనపు కలెక్టర్.. అంతకన్నా ఎక్కువ స్థలమైతే 21 రోజుల లోపు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అనుమతి ఇచ్చిన తర్వాత యజమాని.. నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణం చేపట్టారా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారులదేనన్నారు. పరిశీలన అనంతరం నివేదికను మున్సిపల్ కమిషనర్లకు ఇవ్వాలని అన్నారు. ఆ తర్వాత.. మున్సిపల్ కమిషనర్ ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత ఎన్ఫోర్స్​మెంట్ టీమ్​పై ఉంటుందని తెలియజేశారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని కోరారు.

ఇదీ చదవండి:లాక్‌డౌన్‌పై ఇవాళ సర్కారు కీలక నిర్ణయం!

ABOUT THE AUTHOR

...view details