నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమలలో కలెక్టర్ శర్మన్ పర్యటించారు. చెంచుల అటవీ, భూ సమస్యల పరిష్కారం కోసం మన్ననూర్ ఐటీడీఏ కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
చెంచుల జీవన విధానం గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెంచుల మ్యూజియంను పరిశీలించి.. వీలైనంత త్వరగా మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు.
మల్లెలతీర్థం చెంచులు.. తమపై ఫారెస్టు అధికారుల ఆగడాలు ఎక్కువయ్యాయని కలెక్టర్కు విన్నవించుకున్నారు. చెక్ పోస్టు, పర్యాటక స్థలాల నిర్వాహణ.. తమకే అప్పగించాలని వారు డిమాండు చేశారు.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, సంబంధిత అధికారులతో ఓ కమిటీ వేసి త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ భూముల విషయంలో కూడా ఫారెస్టు అధికారులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:నల్లమలలో శిథిల సంపదకు పునరుజ్జీవం