నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ పది గంటలకు తనిఖీకి రాగా... 18మందికి ముగ్గురు వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. 11గంటల వరకు ఎదురుచూసినా సగానికిపైగా వైద్యులు, సిబ్బంది రాలేదు. డాక్టర్ల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసుపత్రిలో పత్తాలేని వైద్యులు..జీతం కట్ చేసిన కలెక్టర్ - NAGAR KARNOOL COLLECTOR SRIDHAR SUDDEN VISIT IN HOSPITAL
'ఆస్పత్రిలో పని చేయాలనుకుంటున్నారా... లేదా? ఎన్నిసార్లు చెప్పినా... మార్పు రాదా..?' అంటూ నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ శ్రీధర్ మండిపడ్డారు. సిబ్బంది పని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

NAGAR KARNOOL COLLECTOR SRIDHAR SUDDEN VISIT IN HOSPITAL
ఆసుపత్రిలో పత్తాలేని వైద్యులు..జీతం కట్ చేసిన కలెక్టర్
ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించి, జిల్లా సూపరిండెంట్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. విధులకు హాజరుకాని వారందరికీ ఒక్కరోజు జీతాన్ని నిలిపేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్లక్ష వైఖరిని తప్పుబడుతూ... క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సిబ్బందిని హెచ్చరించారు.