తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్వకుర్తిలో అదనపు కలెక్టర్​ పర్యటన

నాగర్​ కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా అదనపు కలెక్టర్​ పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మండలంలోని పలు గ్రామ పంచాయితీల కార్యదర్శులతో సమావేశమై.. పలు అంశాల గురించి సమీక్షించారు.

Nagar Karnool Additional Collector Tour In Kalwakurthy Mandal
కల్వకుర్తిలో అదనపు కలెక్టర్​ పర్యటన

By

Published : Jul 3, 2020, 8:34 PM IST

నాగర్​ కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మండలంలోని వేపూరు, తర్నికల్​ తండా, తర్నికల్​, మార్చాల గ్రామాల్లో అదనపు కలెక్టర్​ మను చౌదరి, శిక్షణా కలెక్టర్​ చిత్రా మిశ్రా, డీఆర్డీవో సుధాకర్​లు పర్యటించారు. పలు గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి.. పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. వైకుంఠధామం, డంపింగ్​ యార్డు, నర్సరీలను పరిశీలించారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తిత చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మండలంలోని 24 గ్రామ పంచాయతీల గ్రామ కార్యదర్శులతో ఉపాధి హామీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. వివిధ గ్రామాల్లో హరితహారం, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయని అడిగి వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సుధాకర్, ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ గోవర్ధన్, ఏపీడి గోవింద రాజన్, ఎంపీడీవో బాలచంద్ర సృజన్, ఏపీవో చంద్ర సిద్దార్థ్, ఎంపీవో దేవేందర్, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: గుడ్​న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కోవాగ్జిన్​!

ABOUT THE AUTHOR

...view details