నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణం ఇందిరానగర్లో ముచ్చపోతుల వెంకటయ్య అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. ఐనోల్లో వ్యక్తి దారుణ హత్యకు గురై 24 గంటలు గడవక ముందే జరిగిన ఈ ఉదంతం పట్టణంలో కలకలం రేపుతోంది. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బాత్రూమ్లో వేలాడదీశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అచ్చంపేటలో కలకలం రేపుతున్న మరో హత్య - murder mistry
అచ్చంపేటలో గుర్తుతెలియని వ్యక్తులు వెంకటయ్య అనే ఇందిరానగర్ వాసిని దారుణంగా హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బాత్రూమ్లో వేలాడదీశారు. మృతుని కుటుంబసభ్యులను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పరామర్శించారు.
![అచ్చంపేటలో కలకలం రేపుతున్న మరో హత్య murder mistry in achampeta indira nagar colony](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6285309-thumbnail-3x2-murder.jpg)
అచ్చంపేటలో కలకలం రేపుతున్న మరో హత్య
ఈ దారుణానికి ఒడిగట్టింది సమీప బందువులేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఘటనాస్థలికి చేరుకొని మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు.
అచ్చంపేటలో కలకలం రేపుతున్న మరో హత్య
ఇదీ చూడండి :దేశంలో మరో ఆరుగురికి కరోనా