తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగర్​కర్నూలులో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం - municipal election campaigning in nagarkurnool by all party candidates

నాగర్​కర్నూల్ పట్టణంలోని 19-22 వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలంటూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డి ప్రచారం నిర్వహించారు.

municipal election campaigning in nagarkurnool by all party candidates
నాగర్​కర్నూలులో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

By

Published : Jan 18, 2020, 1:12 PM IST

పురపాలిక ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నాగర్​కర్నూలు పట్టణంలోని 19 - 22 వార్డుల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక తెరాస వార్డు సభ్యులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

మున్సిపల్ ఎన్నికల్లో తెరాసను గెలిపిస్తే.. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల్లో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అవకాశముందన్నారు.

కాంగ్రెస్, సీపీఎం, భాజపా అభ్యర్థులు తమ వార్డుల్లో తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికి శుక్రవారం అభ్యర్థులు మసీదులకు వెళ్లారు.

నాగర్​కర్నూలులో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

ఇదీ చూడండి: రాజకీయ వివాదంగా 'సాయి జన్మభూమి'

ABOUT THE AUTHOR

...view details