నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 34 శాతం పోలింగ్ నమోదైంది. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు, ఎంపీ రాములు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అచ్చంపేటలో 11 గంటల వరకు 34 శాతం పోలింగ్ - తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అచ్చంపేటలో ఉదయం 11 గంటల వరకు 34 శాతం పోలింగ్ నమోదైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటేసేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
achampet
పురపాలికలో 20 వార్డులకు ఓటింగ్ కొనసాగుతోంది. 20,529 మంది ఓటర్లు... ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బరిలో 66 మంది అభ్యర్థులు ఉన్నారు. 40 పోలింగ్ కేంద్రాల పోలింగ్ జరుగుతోంది. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఓటేసేందుకు వచ్చే వారంతా కచ్చితంగా మాస్కు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి:మినీ మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం
Last Updated : Apr 30, 2021, 11:50 AM IST