నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి హైదరాబాద్‌కు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. వంగూరు మండలం డిండిచింతపల్లి నుంచి పోల్కంపల్లి గ్రామాల మధ్య పాదయాత్ర సాగుతోంది.
మహేంద్ర రైతులు, వివిధ గ్రామాల ప్రజలు, యువజన సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. పాదయాత్రలో మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.