శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో జగిరిన అగ్నిప్రమాద ఘటన మానవ తప్పిదమేనని ఎంపీ రేవంత్రెడ్డి ఆరోపించారు. దుర్ఘటనపై సీబీఐ విచారణ కోసం పార్లమెంట్లో గళమెత్తుతామని స్పష్టం చేశారు.
శ్రీశైలం అగ్నిప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన రేవంత్రెడ్డి, మల్లు రవిని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి లత్తిపూర్ పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉప్పునుంతల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో రేవంత్రెడ్డి, మల్లు రవిని హైదరాబాద్కు తరలించారు.