నాగర్ కర్నూల్ పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ సమావేశ మందిరంలో 75వ స్వాతంత్ర భారత అమృత్ మహోత్సవ్ నిర్వహించారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళన సభకు ఎంపీ రాములు, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రజల్వన చేశారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దేశం దినదినాభివృద్ధి చెందుతుందని రాములు తెలిపారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
'ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపాల్సిన బాధ్యత మీకు ఉంది' - babu jagjivan ram
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని ఎంపీ రాములు తెలిపారు. ప్రజల ఆకాంక్ష, ఆశయాలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వాలు పాలించలేవని... కవులు, కళాకారులు ప్రభుత్వంలోని లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు.
'ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపాల్సిన బాధ్యత మీకు ఉంది'
ప్రజల ఆకాంక్ష, ఆశయాలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వాలు ఒకేలా పాలించలేవనన్నారు. కవులు, కళాకారులు ప్రభుత్వంలోని లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి కోసం ఏం చేయాలి? ఎలాంటి పథకాలు తీసుకురావాలన్న అంశాలపై కవులు తమ గళాన్ని వినిపించాలని సూచించారు.
ఇదీ చూడండి:ప్రత్యక్ష తరగతులు లేకుండా కష్టం... కనీసం వారికైనా...