నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట, లింగసానిపల్లి, గుండూరు, ముకురాల గ్రామాల్లో ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, డీసీసీబీ ఛైర్మన్ నిజాం పాషాలు పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రంలో రబీ సీజన్లో 50 లక్షల ఎకరాల పంట సేద్యం జరిగిందని, అందులో 40 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేశారని ఎంపీ అన్నారు.
వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే - వరి కొనుగోలు కేంద్రాలు
కల్వకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, డీసీసీబీ ఛైర్మన్ నిజాం పాషాలు కలిసి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఏ గ్రేడ్ రకం వరి క్వింటాల్ రూ.1835, బీ గ్రేడ్ రకం క్వింటాల్ రూ.1815 ధర ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 222 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 222 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఏ గ్రేడ్ రకం వరి క్వింటాల్కి రూ.1835, బీ గ్రేడ్ రకం వరి క్వింటాల్కి రూ.1815 ధరను అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బైరెడ్డి సింగారెడ్డి, కల్వకుర్తి జడ్పీటీసీ సభ్యుడు భరత్ ప్రసాద్, పురపాలిక ఛైర్మన్ ఎడ్మ సత్యం, పీఎసీఎస్ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ శ్యాంసుందర్, మండల వ్యవసాయ శాఖ అధికారిణి శ్రీలత, ఎంపీపీ సునీత, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే