నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు నాగర్కర్నూల్ ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సూచించారు. ఉపాధి హామీ, పంచాయతీరాజ్ పనులు వేగవంతం చేయాలన్నారు. సమస్యలు ఏవైనా... ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారని వివరించారు.
"అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి" - ఎంపీ రాములు
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల సర్వసభ్య సమావేశానికి నాగర్కర్నూల్ ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండల స్థాయి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
సర్వసభ్య సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే