రాష్ట్రంలో తెరాస, మజ్లీస్ పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకు మత తత్వ రాజకీయాలు చేస్తున్నాయని ఎంపీ బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో నిర్వహించే శివాజీ పరివార్ యాత్రలో పాల్గొనేందుకు వెళ్తూ.. మార్గంమధ్యలో కల్వకుర్తిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. బంధువులతో పాటు స్థానికులను కలిసి ముచ్చటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
'తెరాస, ఎంఐఎం పార్టీలు మతతత్వ రాజకీయాలు చేస్తున్నాయి' - కేసీఆర్‌పై బండి సంజయ్ విమర్శలు
యాగాలంటూ కేసీఆర్... దేవున్ని నమ్మని కేటీఆర్... రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ బండి సంజయ్ ఆరోపిచారు. ఆమనగల్లులోని ఓ కార్యక్రమానికి వెళ్తూ.. కల్వకుర్తిలోని బంధువుల ఇంటికి వెళ్లి పలకరించారు. అనంతరం స్థానికులతో సమస్యలపై మాట్లాడారు.
MP BANDI SANJAY KUMAR CRITICIZED TRS AND MIM PARTIES
యజ్ఞాలు, యాగాంలంటూ తిరిగే సీఎం కేసీఆర్... దేవున్ని నమ్మని అతని కుమారుడు కేటీఆర్‌ను మార్చుకోవాలని బండి సంజయ్ హితవు పలికారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను హిందూ సమాజం గమనిస్తోందని.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును గురించి ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలపాలన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాలను అమలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేస్తున్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సంజయ్ ఆరోపించారు.