నాగర్ కర్నూల్లో పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ భేటీకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. పలు అంశాలపై మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లతో చర్చించారు. పట్టణంలో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
సమన్వయంతో మందుకెళ్లాలి: ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి - mla marri janardhan reddy latest news
మున్సిపల్ కౌన్సిలర్లు, పురపాలిక సిబ్బంది సమన్వయంతో పనిచేసి నాగర్ కర్నూలు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కోరారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పురపాలక సంఘం కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు పార్టీలను పక్కన పెట్టి 24 మంది కౌన్సిలర్లు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులైనా... పాలకులైనా... అవినీతికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మరికొన్ని రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తవుతాయని చెప్పారు. మున్సిపల్ కౌన్సిలర్లు, పురపాలిక సిబ్బంది సమన్వయంతో పనిచేసి నాగర్ కర్నూలు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు.
ఇదీ చదవండి-బంగాల్ బరి: 'మోదీ' అస్త్రంతోనే దీదీపై గురి!