రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త అంతిమయాత్రలో పాల్గొని పాడెను స్వయంగా మోశారు నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి. కొన్ని రోజుల క్రితం నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో మునీందర్ అనే తెరాస కార్యకర్త రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా.. అతడిని హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్చారు.
కార్యకర్త పాడెను మోసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి - పాడెను స్వయంగా మోసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వార్త
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త పాడెను స్వయంగా మోశారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. మృతుడి పిల్లల చదువుకు, వివాహాలకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఆర్థిక సాయాన్ని కూడా అందించి తన కార్యకర్త కుటుంబం పట్ల దాతృత్వాన్ని చాటుకున్నారు.
కార్యకర్త పాడెను మోసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
పరిస్థితి విషమించడంతో నిన్న సాయంత్రం మృతి చెందాడు. కార్యకర్త మృతి వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే అతడి ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి.. పిల్లల చదువుకు, వారి వివాహాలకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని వారికి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:డబిర్‌పురలో ఉద్రిక్తత... ఎంఐఎం, భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం
Last Updated : Dec 16, 2020, 7:07 PM IST