తెరాస అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గతంలో సాధ్యం కాని తీరులో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్... గ్రామ పంచాయతీలను, పురపాలికలను అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళుతున్నారని కొనియాడారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పురపాలిక పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో మిషన్ భగీరథ పైప్లైన్కు భూమి పూజ, పురపాలక సంఘానికి సంబంధించిన మూడు కొత్త ట్రాక్టర్లను ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రారంభించారు.