నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని తాళ్లపల్లి, నడిగడ్డ, కార్వంగ గ్రామాలలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆయా గ్రామాల్లోని చెరువులు, అలుగులు పారాయి. కుంటలు తెగిపోయి.. వాగులు పొంగి పొర్లి.. గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు, మూడు రోజులు ఆ గ్రామాల ప్రజలు వేరే గ్రామాలకు వెళ్లకుండా ఆటంకం కలిగింది.
తెలకపల్లి మండలంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పర్యటన - నాగర్ కర్నూల్ జిల్లా వార్తలు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లాయి. వాగుల ఉధృతికి గ్రామాల్లోకి చేరిన గ్రామాల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పర్యటించారు. వాగు ప్రవాహానికి రాకపోకలు నిలిచిపోయిన గ్రామాలకు రహదారి నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
రాకపోకలు నిలిచిపోయిన తాళ్లపల్లి, నడిగడ్డ, కార్వంగ గ్రామాలను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు. వర్షాల వల్ల కలిగిన ఇబ్బందులను ప్రజలు ఎమ్మెల్యేకు వివరించారు. వాగు వల్ల రోడ్డు పాడైపోయి.. ప్రయాణానికి ఇబ్బందిగా ఉందని.. రాకపోకలకు అంతరాయం కలగకుండా బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్యలన్నింటి మీద నివేదిక తయారుచేసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:హైదరాబాద్‌కు పచ్చందాలు... 75 ప్రాంతాల్లో చిట్టడువులు